- Advertisement -

నాకు ఒక్క ఫోన్ చెయ్యండి.. శేఖర్ మాస్టర్ దాతృత్వం!

- Advertisement -

ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ పంపిణీ మొదలైన సమస్యలతో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి ఉన్నారు. వీరిని ఆదరించడానికి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు వారికి తోచిన విధంగా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇదే కోవలో టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ లాక్‌డౌన్ కార‌ణంగా షోలు లేక ఉపాధి కోల్పోయిన డ్యాన్స‌ర్ల‌కు త‌నవంతు స‌హాయాన్ని అందించేందుకు ముందుకొచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వేళ పొట్టకూటి కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనకు రోడ్లపై కనిపించేవారే కాకుండా మరెంతో మంది భోజనానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారాని, అలాంటి వారిలో డ్యాన్స్‌నే నమ్ముకొని జీవనం సాగిస్తున్న డ్యాన్సర్లదీ అదే పరిస్థితి ఉందని , ఏదైనా టీవీ షోలు, కార్య‌క్ర‌మాలు జ‌రిగితే త‌ప్ప వాళ్ల‌కు ఉపాధి దొరకడం కష్టంగా మారింది. కనుక ఇలాంటి వారికి సాయం చేయడం మన ధర్మం అని చెప్పాడు.

Also read:మెగాస్టార్ చిరంజీవికి ఎంతమంది ఫాలోవర్స్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు, టీవీ షోలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రూప్‌ డ్యాన్సర్లు, టీవీ షోలు చేసే డాన్స్ కార్మికులు వారికి అవసరమైన నిత్యావసర సరకుల కోసం తనను సంప్రదించాలని వారికి కోరారు. అలాగే కొన్ని ఫోన్‌ నెంబర్లు అందుబాటులో ఉంటాయని ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక వీడియో పంచుకున్నారు. ప్రస్తుతం అందరూ మనోధైర్యం ఉండాలని సూచించాడు. అలాగే మాస్కో, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని,అవసరమైతే తప్ప బయటకు రావద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలని కోరారు.

Also read:భద్రతా దళాలు కాల్పుల్లో నటికీ తీవ్ర గాయాలు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -