స్టార్ అవ్వడం కోసం ఎంతైన కష్టపడొచ్చు..?

- Advertisement -

దక్షిణాది అగ్రకథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. తాజాగా తెలుగులో నితిన్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి రూపొందించిన చిత్రం ‘చెక్‌’. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాయర్‌ మానసగా కీలకపాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది.దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతూనే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రకుల్‌ అక్కడా క్రేజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది.

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది.తాజాగా మాట్లాడుతూ మీ ఫలానా సినిమా చాలా బాగుంటుంది. మీరు చాలా బాగా నటించారు, అంటూ అభిమానులు ఆత్మీయంగా నవ్వుతూ పలకరించినప్పుడు ఉండే ఆనందానికి హద్దే ఉండదు. ఆ నవ్వు కోసం ఎంతైనా కష్టపడాలనిపిస్తుందని , అలాగే నా స్టార్‌డమ్‌ ఏమైపోతుందో అనే భయం లేకుండా ముందుకెళ్లడమే నా విజయానికి ప్రధాన కారణం అని రకుల్ ప్రీత్ సింగ్ తన అనుభవాన్ని తన అభిమానులతో పంచుకుంది.

- Advertisement -

Also read:భద్రతా దళాలు కాల్పుల్లో నటికీ తీవ్ర గాయాలు..?

రకుల్ బాలీవుడ్లో అడుగుపెట్టి ఏడేళ్లు అవుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. అమితాబ్‌బచ్చన్, అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ‘మేడే’ సినిమాలోనూ, జాన్‌ అబ్రహ జంటగా ‘ఎటాక్‌ ’మూవీలోనూ, ఆయుష్మాన్‌ ఖురానా ‘డాక్టర్‌ జి’, అజయ్‌దేవ్‌గణ్‌తో ‘థ్యాంక్‌ గాడ్‌’ ఇలా భారీ బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తోంది రకుల్‌.ఇక టాలీవుడ్ లో క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో రకుల్‌ ప్రీత్ సింగ్ డీగ్లామర్‌ రోల్‌లో ఓబులమ్మ అనే గ్రామీణ అమ్మాయిగా కనిపించనున్నారు.

Also read:యాపిల్ యూజర్స్ కు ఈ యాప్ గురించి తెలుసా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -