థియేటర్లతో పోటీగా ఓటీటీ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఓటీటీల్లోనూ సినిమాలు చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి వెబ్ సిరీస్‌లు. సినిమాలతో పోలిస్తే వీటి కోసం సెట్లు, లొకేషన్లు ఇలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.
అయితే ఓ వెబ్ సిరీస్‌కు పెట్టిన ఖర్చు చూస్తే ఖచ్చితంగా షాకవుతారు. ఎందుకంటే ఒక్క ఎపిసోడ్‌కే రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు. అదే ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్.
జేఆర్ఆర్ టోల్కీన్ రచించిన పాపులర్ నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ తెరకెక్కింది. 8 ఎపిసోడ్లతో రిలీజ్ కాగా తొలి సీజన్‌కు అయిన ఖర్చు ఏకంగా 1 బిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.8300 కోట్లు) అని అంచనా. అంటే ఒక్క ఎపిసోడ్‌కే సుమారు రూ.480 కోట్లు. ఒక్క ఎపిసోడ్ ఖర్చుతోనే మన దేశంలో వందలాది చిన్న సినిమాలే కాదు మూడు, నాలుగు పెద్ద సినిమాలు తీయొచ్చని సినిమా లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఓటీటీల్లోనే ఇది హైయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కాగా ఈ రికార్డును మరే సినిమా అధిగమించలేదేమో.