Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ పోటీ అక్కడి నుండే!

- Advertisement -

టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపకాల వ్యవహారం మరికొద్ది రోజుల్లోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు 30 సీట్లు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. దీనికి పవన్ సైతం ఒకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ 30 స్ధానాలు ఏంటనే దానిపై కూడా ఓ అంచనాకు వచ్చారు ఇరు పార్టీల నేతలు.

ఇక జనసేన పోటీ చేసే స్థానాలు ఇవేనంటూ రోజుకో వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతుండగా తాజాగా జనసేనాని, పవన్ పోటీ చేసే స్థానం ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం రెండు స్థానాల నుండి పోటీ చేయగా ఈ రెండు స్థానాల్లో ఓడిపోయారు. అందుకే ఈసారి తాను పోటీ చేయాలనుకుంటున్న స్థానంపై పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఈ సారి కూడా పవన్ రెండు స్థానాల నుండి పోటీ చేయనుండగా ఇందులో ఒకటి భీమవరం అని తెలుస్తోంది. దీంతో పాటు మరోక స్థానం రాయలసీమ నుండి ఉండనున్నట్లు సమాచారం. సీమలో పార్టీ బలపడాలంటే స్వయంగా పవన్ రంగంలోకి దిగితే మేలని జనసేన నేతలతో పాటు టీడీపీ నేతలు భావిస్తున్నారట. అందుకే రాయలసీమలో ఏదో ఒక నియోజిక వర్గం నుంచి పవన్ పోటీ చేయాలని భావిస్తున్నారట. మరి పవన్ పోటీ చేసే స్థానంపై జనసేన నేతలు క్లారిటీ ఇస్తరా లేదా అన్నది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -