Thursday, May 2, 2024
- Advertisement -

‘ఖైదీ’తో ‘శాశ్వత ఖైదీ’ని చేసేశారు!

- Advertisement -

వెండితెర ఆల్ టైం హిట్ మూవీల్లో ఒకటి ఖైదీ. ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో మైలురాయిగా నిలిచిన చిత్రం ఖైదీ. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం 1983లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఇక ఈ సినిమాలో తొలుత సూపర్ స్టార్ కృష్ణను హీరోగా అనుకున్న ఆయన తిరస్కరించడంతో చిరుకు ఈ ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తొలి క్లాప్‌ని కృష్ణానే కొట్టడం విశేషం.

అక్టోబర్ 28న సరిగ్గా 40 సంవత్సరాల క్రితం ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో చిరు యాక్షన్ హీరోగా మారిపోయారు. ఈ సినిమాకు చిరు తీసుకున్న రెమ్యునరేషన్ 2 లక్షలు. అందుకే ఖైదీ రిలీజ్‌పై స్పందిస్తూ ఖైదీ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసిందని వెల్లడించారు చిరు. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది…ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇక తెలుగు ప్రేక్షకులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు!అంటూ ఎమోషనల్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -