Monday, May 6, 2024
- Advertisement -

బ్రేకింగ్…జనసేన పోటీచేసే స్థానాలివే!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా సీట్ల సంఖ్య దాదాపు ఖరారైంది. ఈ నెల 8న ఈ రెండు పార్టీలు పోటీ చేసే స్థానాలు, సీట్ల సంఖ్యపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.ఇక సీట్ల సంఖ్య ఖరారు కావడంతో జనసేన ఏఏ స్థానాల్లో పోటీ చేస్తుందనే టెన్షన్ అందరిలో నెలకొంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనుండగా ఆ పార్టీ నేతల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జనసేన పోటీ చేసే స్థానాలివేనని తెలుస్తోంది.

అమలాపురం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం లేదా తణుకు,ఏలూరు లేదా కైకలూరు, తెనాలి, దర్శి లేదా చీరాల ,పెడన, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, రాజంపేట లేదా రైల్వే కోడూరు, తిరుపతి లేక చిత్తూరు,విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల లేదా గజపతినగరం,విశాఖ జిల్లా భీమిలి,విశాఖ దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లో ఒకటి జనసేనకు ,చోడవరం లేక అనకాపల్లి, పెందుర్తి లేదా యలమంచిలిల్లో జనసేన పోటీ చేయనుంది. ఇక పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పి.గన్నవరం, రాజానగరం జనసేనకు ఇప్పటికే ఖరారు కాగా రాజమండ్రి రూరల్ లేదా తూర్పుగోదావరి జిల్లాలో మరో నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ ప్రకటించిన రెండు స్థానాలు రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేయనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -