- Advertisement -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపట్టారు ప్రజలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ పేరుతో ప్రదర్శన చేశారు ప్రజలు.
ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు నిరసనకారులు. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, చికాగో, లాస్ఏంజెలెస్ సహా మొత్తం 50 నగరాల్లో భారీ నిరసనలు చేపట్టారు.
కెనడాతో పాటు బెర్లిన్, రోమ్, పారిస్, స్వీడన్‌లలోని యూఎస్ రాయబార కార్యాలయాల వెలుపల ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల నియంత్రణ చర్యలు, విశ్వవిద్యాలయాలకు నిధులు తగ్గించడం, అనేక రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ దళాలు మోహరించడం వంటి కఠిన నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.
