- Advertisement -
తిరుపతి టిడిపిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ బాగోతంపై టిడిపి నేత జె.బి.శ్రీనివాస్ నిలదీశారు. అపార్ట్మెంట్ యజమానులు, నూతనంగా నిర్మిస్తున్న భవన యజమానులు నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణపై ఆరోపణలు చేశారు.
రూ. 10 లక్షలు వరకు మామూళ్లు ఇవ్వాలంటూ అపార్ట్మెంట్ యజమానులు బెదిరిస్తున్నారని డిప్యూటి మేయర్ ముద్ర నారాయణపై విమర్శలు చేశారు.
నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో టిడిపి నేతలు మాటలు యుద్ధం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
