Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్నికల వేళ…పవన్‌కు బిగ్ షాక్

- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, పోతిన మహేశ్‌ జనసేనకు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పవన్‌కు పంపించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు ధన్యవాదాలు తెలిపారు.

జనసేన ఆవిర్భావం నుండి ఉన్నారు పోతిన మహేష్. ఇక ఏపీలో టీడీపీ -జనసేన -బీజేపీ కూటమి పొత్తులో భాగంగ మహేశ్ ఆశీంచిన విజయవాడ పశ్చిమ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో అప్పటినుండి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు మహేష్. ఇక ఆయన అనచరులు పలు దఫాల్లో ఆందోళన చేపట్టారు. ఇక మహేష్ సైతం తన కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి ఆందోళన చేపట్టారు.

అయితే పవన్ మాత్రం అస్సలు పట్టించుకోలేదు. దీంతో జనసేనలో తనకు రాజకీయ భవిష్యత్ లేదని భావించిన మహేష్…పార్టీకి రాజీనామా చేశారు. తన లేఖను పవన్‌కు పంపారు. ఇక విజయవాడ పశ్చిమ నుండి మాజీ ఎంపీ సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -