Monday, April 29, 2024
- Advertisement -

మాస్ అవతారంలో పుష్పరాజ్..

- Advertisement -

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 ది రూల్ టీజర్ వచ్చేసింది. బన్నీ ఫ్యాన్స్‌కి పునకం వచ్చేలా మాస్ అవతారంలో బన్నీ అదిరే ట్రీట్ ఇచ్చారు. పట్టుచీరలో మెడలో నిమ్మకాయాల మాలతో ఒంటినిండా బంగారు ఆభరణాలతో అమ్మోరు గెటప్ లో అదరహో అనిపించేల టీజర్‌ని కట్ చేశారు దర్శకుడు సుకుమార్.

గంగమ్మ జాతరలో ఉగ్రరూపంతో నడిస్తూ చీరకొంగును నడుముకు చుట్టుకుంటూ వస్తున్నట్లు చూపించగా టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ కూడా లేదు. అయినా ఫ్యాన్స్‌ని ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్.

పుష్ప ది రైజ్‌తో సినీ ప్రేమికుల‌ను ఆకట్టుకున్నారు సుక్కు. అల్లు అర్జున్ న‌ట‌న‌, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొనగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -