- Advertisement -

రామచంద్రాపురం..ఈసారి పోటీ వారిమధ్యేనా?

- Advertisement -

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇంకా షెడ్యూల్ విడుదలగాక ముందే వైసీపీ, టీడీపీ కూటమి మధ్య నువ్వా, నేనా అన్నట్లు మాటల యుద్ధం నడుస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీలు బలాబలాన్ని అంచనా వేసుకుంటు ముందుకుసాగుతున్నాయి.

ఇక గోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే కాపులు, శెట్టిబలిజ సామాజికవర్గాల ఆధిపత్యమే ఎక్కువ. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్సే ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపుతాయి. గత ఏడు ఎన్నికలను పరిశీలిస్తే నాలుగు సార్లు కాపు సామాజిక వర్గ నేతలు, మూడు సార్లు శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన నేతలు విజయం సాధించారు.

వైసీపీ… శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సూర్యప్రకాశ్‌కు టికెట్‌ ఖరారు వైసీపీచేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్‌కి పంపింది వైసీపీ హైకమాండ్‌. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి ఎవరనేది ఖరారు కావాల్సి ఉంది. టీడీపీ తరపున ముగ్గురు నేతలు పోటీ పడుతుండగా జనసేన నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల దొరబాబు పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. వైసీపీ శెట్టి బలిజ వర్గానికి చెందిన నేతకు సీటు ఇవ్వడంతో టీడీపీ -జనసేన కూటమి నుండి కాపు సామాజికవర్గ అభ్యర్థి బరిలో ఉండే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రెండు కులాల మధ్య జరుగుతున్న పోరులో ఈసారి అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -