Thursday, May 16, 2024
- Advertisement -

రెబల్స్ ట్రబుల్..వెనుకంజలో కూటమి!

- Advertisement -

రెబల్స్ ట్రబుల్‌తో వెనుకంజలో ఉన్నారు టీడీపీ నేతలు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికి తమ నామినేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు కూటమి రెబల్ నేతలు. ప్రధానంగా టీడీపీకి రెబల్ పోరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ గెలుపు అవకాశాలపై ఇది ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

చంద్రబాబు, టీడీపీపై గుర్రుగా ఉన్న నేతలు.. ఇండిపెండెంట్ గా గెలిచి తమ సత్తాచాటాలని భావిస్తున్నారు. ఇక రెబల్స్ పోరు ఎక్కువగా విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలిలో ఉండగా ఇక్కడ టీడీపీలో అసమ్మతి వైసీపీ విజయానికి రాచబాటలు వేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

25 లోక్ సభ స్థానాలకు 503 మంది బరిలో ఉండగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,075 మంది పోటీలో ఉన్నారు. నంద్యాల పార్లమెంటుకు అత్యధికంగా 36 నామినేషన్లు దాఖలుకాగా రాజమండ్రి ఎంపీ స్థానానికి అత్యల్పంగా 12 నామినేషన్లు వచ్చాయి. ఇక తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -