Sunday, May 19, 2024
- Advertisement -

అచ్చెన్నాయుడికి షాకేనా..బాబు ఏం చేయబోతున్నారు?

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దక్కిన సంగతి తెలిసిందే. ఇక మధ్యంతర బెయిల్ సందర్భంగా ఇచ్చిన కండీషన్స్‌ని సడలించింది న్యాయస్థానం. దీంతో పార్టీ సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనేందుకు చంద్రబాబుకు వెసులుబాటు లభించింది. దీంతో ఇకపై పూర్తిస్థాయి రాజకీయాలపై చంద్రబాబు దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

రెండు మూడు రోజుల విశ్రాంతి తర్వాత పార్టీ నేతలతో సమావేశాలు, భవిష్యత్ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధ్యక్షుడి మార్పుపై చర్చ జరుగుతోంది. ఏపీ టీడీపీ చీఫ్‌గా ఉన్న అచ్చెన్నాయుడిని మారుస్తారని చర్చ నడుస్తోంది. మూడు సంవత్సరాలుగా టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న అచెన్నా చేసిందేమి లేదని పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల్లో ధైర్యం నింపడంలో అచ్చెన్న విఫలమయ్యారని బాబు సైతం భావిస్తున్నారట. అందుకే ఆయన స్థానంలో కొత్త వ్యక్తికి బాధ్యతలిస్తారని తెలుస్తోంది. బీసీ ఎంజెండాలో భాగంగా బీసీ నాయకుడినే పారట్ఈ అధ్యక్షుడిగా చేస్తారని సమాచారం. అలాగే జనసేన సీట్ల సంఖ్య, స్థానాలను ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో తేల్చే పనిలో ఉన్నారట చంద్రబాబు. ఫలితంగా అసంతృప్తులను బుజ్జగించి ఓట్లు చీలకుండా ఉంటుందని ప్లాన్ చేస్తున్నారట. మరి పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించిన చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు…అవి టీడీపీ గట్టెక్కిస్తాయో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -