Monday, April 29, 2024
- Advertisement -

రేవంత్ కేబినెట్ ఇదే…వైరల్!

- Advertisement -

తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి రేపు(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండగా ఇందుకు ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్…కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. కేబినెట్ కూర్పుపై చర్చించనున్నారు.

ఇక రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేబినెట్‌లో ఛాన్స్ దక్కించుకునే వారి పేర్లు ఇవేనంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో జరుగుతోంది. కేబినెట్‌లో మొత్తం 18 మందికి ఛాన్స్ ఉండగా రేవంత్‌తో పాటు 15 మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇక ఛాన్స్ దక్కించునే వారిని పరిశీలిస్తే జిల్లాల వారీగా ఖమ్మం నుండి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ నుండి సీతక్క, కొండా సురేఖ, నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ నుండి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్ నుండి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి,ఆదిలాబాద్ నుండి గడ్డం వివేక్, కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్ ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోండగా దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -