Sunday, April 28, 2024
- Advertisement -

రేవంత్ తొలి సంతకం దీనిపైనే..ఆమె ఆ అదృష్ట వంతురాలు!

- Advertisement -

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎల్బీ స్టేడియం ముస్తాభవుతోంది. గురువారం మధ్నాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం జరగనుండగా ఈ కార్యక్రమానికి అతిథులుగా కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో హామీలిచ్చారు రేవంత్. ఇందులో ప్రదానంగా ఎంఏ చదివి ఉద్యోగం లేక కష్టపడుతున్న ఓ దివ్యాంగురాలికి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రజని అనే దివ్యాంగురాలికి మాట ఇచ్చారు రేవంత్. అక్టోబర్ 17న తన వద్దకు వచ్చిన రజనీకి మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజనీకి ఆహ్వానం అందింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయ్యాక రజనీ ఉద్యోగ నియామక పేపర్స్ పై సంతకం చేసి ఇవ్వనున్నారు రేవంత్.

దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రభుత్వ ఉద్యోగం అందుకున్న తొలి ఉద్యోగార్థిగా నిలవనున్నారు రజని. దీంతో రజని కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తోండగా ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -