Thursday, May 2, 2024
- Advertisement -

బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా తెరపైకి కొత్త పేరు!

- Advertisement -

తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన బీఆర్ఎస్‌కు భంగపాటు తప్పలేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టగా బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. ఇక అనేక తర్జనభర్జనల అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

ఇక బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా ఎవరుంటారు అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలవగా త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేటీఆర్, హరీశ్‌ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో కొత్తపేరు తెరపైకి వచ్చింది.

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరిని బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా ఎన్నకునే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రగతి భవన్ ఖాళీ చేసిన కేసీఆర్‌ ఫాం హస్‌లోనే ఉంటున్నారు. అక్కడే పార్టీ నేతలను కలుస్తున్నారు. సీఎంగా రేపు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌ఎల్పీ నేత ఎవరనేదానిపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా గతంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విజయరామారావు తర్వాత బీసీ నేత ఈటలకు ఫ్లోర్ లీడర్ ఛాన్స్ దక్కగా ఇప్పుడు కూడా దళితులకే ఫ్లోర్ లీడర్ అవకాశాన్ని ఇవ్వాలని భావిస్తున్నారట గులాబీ బాస్. ఇందులో భాగంగానే కడియం పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోండగా ఆయన సీనియర్ నేత. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. క్లీన్ ఇమేజ్ ఉన్న నేత కావడంతో ఆయనే దాదాపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -