Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీతో పొత్తు లేనట్లే..బీజేపీ నేత షాకింగ్!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి చతికిలపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆయన పోటీ చేసిన 8 స్థానాల్లో డిపాజిట్ కొల్పోవడమే కాదు కనీసం ప్రభావం కూడా చూపించలేదు. దీంతో జనసేన పని అయిపోయిందనే టాక్ మొదలైంది. ఇక ఈ ప్రభావం ఏపీలో కూడా పడుతుందని టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తెలంగాణలో జనసేన ఓడిపోయినంత మాత్రాన ఏపీలో తక్కువ అంచన వేయలేమని చెప్పారు. ఇక టీడీపీతో పొత్తు ప్రస్తావన తేకుండానే కేవలం జనసేన,బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు. మా వ్యూహం మాకు ఉందని..తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీ-జనసేన పార్టీలకు వ్యతిరేకంగా పని చేయడం రాజకీయ తప్పిదం అని… ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి వెళ్లడం కాయమనే అనుమాన్ని వ్యక్తం చేశారు. పొత్తుల అంశంపై జాతీయ నేతలు నిర్ణయం తీసుకుటారన్నారు.

వాస్తవానికి కొంతకాలంగా టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా అన్న సందేహం అందరిలో నెలకొంది. అయితే తాజాగా విష్ణు వర్ధన్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే టీడీపీ – జనసేనతో బీజేపీ పొత్తు దాదాపు లేనట్లుగానే కనిపిస్తోంది. వాస్తవానికి బీజేపీతో పొత్తుకు ఇంట్రెస్ట్‌ చూపించలేదు చంద్రబాబు. పవన్ చాలాసార్లు ప్రయత్నించినా చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో పొత్తుకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌తో జతకట్టారు. ఏపీలో కూడా కాంగ్రెస్‌తో పొత్తుతో వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంతా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -