Saturday, April 27, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సానియా?

- Advertisement -

తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో తనదైన శైలీలో దూసుకుపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తు ముందుకు సాగుతున్నారు.ఇప్పటివరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగితా 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక తాజాగా హైదరాబాద్ ఎంపీగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను బరిలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంఐఎం నుండి అసదుద్దీన్, బీజేపీ నుండి మాధవీలత బరిలో దిగుతుండగా కాంగ్రెస్ నుండి ధీటైన అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తుండగా సానియా మీర్జా పేరు ప్రచారంలోకి వచ్చింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సానియాను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లోక్ సభ స్థానం మజ్లిస్‌కు కంచుకోట. అందుకే సానియా అయితే గట్టిపోటి ఇవ్వగలదని హస్తం నేతలు భావించారట. దీనిపై అఫిషియల్‌గా ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -