ఒత్తిడికి లోనవుతున్నారా..అయితే జాగ్రత్త!

ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు. ప్రజల జీవన విధానంలో ఎంతో తేడా వచ్చింది. ఫలితంగా చిన్న చిన్న వాటికే ఒత్తిడికి గురై అనారోగ్యం బారీన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇక ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా డాక్టర్ల దగ్గరికి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు వయసు తేడా లేదు. ఏదో సమస్యతో స్ట్రెస్‌కు లోనై మంచాన పడే పరిస్థితి వచ్చింది.

ఒత్తిడి కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే కాదు జుట్టు రాలడం, మొహంపై ముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇక అధికంగా ఒత్తిడికి లోనయ్యే వారిలో హార్మోన్ల అసమతుల్యత కూడా వస్తోంది. అందుకే ఒత్తిడిని తేలికగా తీసుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామం, కొన్ని జాగ్రత్తలు పాటించడం ఒత్తిడి సమస్య నుండి బయటపడొచ్చు. ఒంటరిగా ఉండకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం అలవాటు చేసుకోవాలి. ఇక ఒత్తిడి నుండి బయట పడటానికి నిద్ర కంపల్సరీ. రోజుకు కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర పోతే మంచి ఫలితం ఉంటుంది. ఫాస్ట్‌ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేట్టు చూసుకోవాలి.