Saturday, May 3, 2025
- Advertisement -

తిలక్‌ వర్మకు సూర్ కుమార్ సలాం

- Advertisement -

చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు వికెట్లు ఉండగా చేధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది భారత్. ఇక మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు తిలక్ వర్మ. మ్యాచ్ ముగియగానే తిలక్‌ వర్మకు సలాం చేశాడు సూర్యకుమార్ యాదవ్.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కరొక్కరుగా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. ఓ దశలో 78 పరుగులకే 5 వికెట్లు కొల్పోయింది భారత్. అయితే తిలక్ వర్మ ఒంటరిపోరాటం జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 55 బంతుల్లో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. మ్యాచ్ విన్నర్ తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 45 పరుగులు, బ్రైడెన్ కార్సే 30 పరుగులతో రాణించారు. 165 పరుగులు చేసింది. జనవరి 28న రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -