Tuesday, April 30, 2024
- Advertisement -

పిఠాపురం..పవన్‌పై తమన్నా పోటీ

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కూటమి పొత్తులో భాగంగా పవన్ పోటీ చేస్తుండగా వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి సైతం ఈసారి పిఠాపురంలో పవన్‌పై పోటీకి దిగారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్‌పై పోటీ చేశారు తమన్నా.

బోడె రామచంద్రయాదవ్‌ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు తమన్నా. 38 మందితో రామచంద్రయాదవ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అందులో తమన్నా పేరు కూడా ఉంది. బరిలోకి దిగుతున్నారు. ఆ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్‌ ప్రకటించిన 38 మంది జాబితాలో తమన్నా సింహాద్రి పేరు ఉండడం ఆసక్తి రేపుతోంది.

గతంలో పవన్ జనసేన పార్టీలోనే పనిచేశారు తమన్నా. మంగళగిరి సీటును ఆశీంచగా దక్కక పోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఇప్పుడు ఏకంగా పవన్‌పైనే పోటీకి దిగుతున్నారు తమన్నా. బిగ్ బాస్ హౌస్‌లో మెప్పించారు తమన్నా. అలాగే క్యాస్టింగ్ కౌచ్‌పై తమన్నా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -