Monday, April 29, 2024
- Advertisement -

మార్గదర్శి కేసు రీ ఓపెన్..సుప్రీం సంచలనం

- Advertisement -

మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ నాటి ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును నేడు కొట్టివేసింది సుప్రీంకోర్టు. తిరిగి ఈ కేసును విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

డిపాజిటర్ల క్లెయిమ్ ల కోసం పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని ఆదేశించగా మాజీ హైకోర్టు జడ్జినీ నియమించి పరిశీలన చేయాలని తీర్పు వెలువరించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వం, ఆర్బిఐ, ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలని..ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలని తెలిపింది. దీంతో ఇప్పుడు మార్గదర్శి చిట్స్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తుండగా ఇప్పటికైన తమకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వేలకోట్లు డిపాజిట్లు సేకరించింది మార్గదర్శి చిట్ ఫండ్స్. చిట్ పాటదారులను సైతం ప్రైజ్ మనీ కూడా ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బందులు పెట్టారు. ఈ క్రమంలో మార్గదర్శి చిట్స్ మీద కోర్టుల్లో పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -