Sunday, May 5, 2024
- Advertisement -

ఉమ్మడి మేనిఫెస్టో..సంక్రాంతికి రిలీజ్!

- Advertisement -

టీడీపీ – జనసేన మేనిఫెస్టో రెడీ అయిందా..?సంక్రాంతికి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారా?, మేనిఫెస్టోతో పాటు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక ఎన్నికల రేసులో ఒకడుగు ముందుంది వైసీపీ. అయితే టీడీపీ – జనసేన పార్టీలో వైసీపీ ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందులో భాగంగా భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి.

ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి మేనిఫెస్టో రిలీజ్‌తో పాటు ఫస్ట్ లిస్ట్ కూడా విడుదల కానుంది. సూపర్ 6 పేరుతో ఇప్పటికి మినీ మేనిఫెస్టో విడుదల చేయగా సంక్రాంతికి పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుంటున్న చంద్రబాబు..దాదాపు 90 సీట్లపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన నేతలకు సంబంధించిన నియోజకవర్గాలు, వివాదం కాని స్థానాలు ఫస్ట్ లిస్ట్‌లో ఉండే అవకాశం ఉండగా 60 – 70 స్థానాలతో ఫస్ట్ లిస్ట్ ఉండే ఛాన్స్ ఉంది.

అయితే జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే సీట్లపై కూడా కన్ఫ్యూజన్ నడుస్తోంది. జనసేన 30 నుండి 40 సీట్లను కోరుతుండగా 20-30 సీట్లు మాత్రమే ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ విడుదల చేసే ఫస్ట్ లిస్ట్‌లో జనసేన అభ్యర్థుల పేర్లు ఉంటాయా లేదా పవన్ సపరేట్‌గా తొలి జాబితా విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఫస్ట్ లిస్ట్ లో చోటు కోసం నేతలందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అభ్యర్థుల ఎంపికలో సీనియర్, జూనియర్ అనే తేడా లేదని గెలుపు మాత్రమే ప్రామాణికం అని చెబుతున్నారు. మరి టీడీపీ ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకునే నేతలెవరో మరి కొద్దిరోజుల్లో తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -