Sunday, May 5, 2024
- Advertisement -

వైరల్…వైసీపీలోకి ఎంపీ గల్లా..?

- Advertisement -

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడం దాదాపు ఖాయం కాగా తాజాగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సైతం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014, 2019లలో రెండు సార్లు గుంటూరు నుండి ఎంపీగా గెలిచిన గల్లా ఈ సారి పోటీకి విముఖత చూపిస్తున్నారు.

అయితే ఈసారి గల్లా పోటీ చేయరని భావిస్తున్న తరుణంలో వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ కి అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి. ప్రస్తుతం రాజకీయ పరిణాలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగుతున్న తరుణంలో గల్లా – చెవిరెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

త్వరలోనే సీఎం జగన్‌తో గల్లా భేటీ అవుతారని వైసీపీలో చేరిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుండి గుంటూరు సీటు ఇస్తారని టాక్ నడుస్తోంది. జగన్ సర్కార్ గల్లా కుటుంబానికి చెందిన అమరరాజాపై గురి పెట్టిందో జయ్‌దేవ్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. తన వ్యాపారాలను తెలంగాణ, తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత తన అనుచరగణంతో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరి గల్లా నిజంగా వైసీపీలో చేరుతారా..?లేదా రాజకీయాలకు స్వస్తీ పలికినట్లేనా అన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -