- Advertisement -
ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా వైసీపీ నేతలు ,వారి ఇళ్లే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఇక పోలీసులు దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెడుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.
ఇక తాజాగా కర్నూల్ జిల్లా డోన్ ఎమ్మెల్యే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇద్దరు యువకులను చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఎమ్మెల్యే తీరును అందరు తప్పుబడుతున్నారు.
వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు తప్పు చేశారంటూ పంచాయితీ పెట్టారు ఎమ్మెల్యే. ఆ ఇద్దరు యువలకు తన కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని ఇష్టం వచ్చినట్లు తిడుతూ కర్రతో కొట్టారు. ఎమ్మెల్యే తీరును అందరూ తప్పుబడుతుండగా కుల సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.