Sunday, May 19, 2024
- Advertisement -

రేవంత్ గేమ్ షురూ..గ్రేటర్‌లో భారీ చేరికలు!

- Advertisement -

త్వరలో తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలుండనున్నాయా?, ముఖ్యంగా గ్రేటర్ నుండి వివిధ పార్టీలకు చెందిన సీనియర్లు హస్తం గూటికి చేరుకోనున్నరా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే హస్తం గూటికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి చేరనున్నట్లు తెలుస్తోంది. తీగల బాటలోనే మరికొంతమంది నేతలు ఉన్నట్లు ఎతలుస్తోంది.

వాస్తవానికి ఇప్పటికే తీగల కాంగ్రెస్‌లో చేరాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీగల జాయినింగ్‌తో హస్తం పార్టీ డోర్లు తెరచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్‌తో భేటీ అయ్యారు తీగల. పార్టీలో చేరిక, భవిష్యత్‌పై చర్చించినట్లు సమాచారం.

మహేశ్వరం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి తీగలకు గ్యాప్ ఉంది. ఇద్దరు ఒకే నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో అంతర్గతంగా విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు తీగల. అన్ని కుదిరితే చెవేళ్ల నుండి ఎంపీగా తీగల పోటీ చేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -