Sunday, April 28, 2024
- Advertisement -

శ్రీముఖి ఎంత పనిచేసిందో తెలుసా?

- Advertisement -

బుల్లితెర స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీముఖి. తనదైన యాంకరింగ్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న ఈ భామ…అప్పుడప్పుడు వెండితెరపై కూడా తళుక్కుమంటుంది. ఇప్పటివరకు ఓ వైపు యాంకరింగ్ మరోవైపు సినిమాల్లో అడపదడపా నటిస్తూ వస్తున్న ఈ బ్యూటీ ఓ బంపర్ ఆఫర్ మిస్ చేసుకుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ సినిమాలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకుంది. వాస్తవానికి ప్రభాస్‌తో సినిమా అంటే ఎగిరి గంతేయని వారుండరూ. కానీ ఈ బ్యూటీ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రభాస్‌కి నో చెప్పేసింది. ఇందుకు గల రీజన్‌ని పరిశీలిస్తే నవ్వు రాకమానదు.

మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ చెల్లెలుగా శ్రీముఖిని అనుకున్నారట మేకర్స్. ఇందుకోసం శ్రీముఖిని సంప్రదించరాట. అయితే ఈ ఆఫర్‌ని తిరస్కరించిందట శ్రీముఖి. ప్రభాస్ నా డార్లింగ్.. ఆయన డై హార్ట్ ఫ్యాన్ నేను ..ఆయనకి సిస్టర్ గా నేను నటించను ..అన్నా అంటూ నా నోటితో నేను పిలవలేను అని మేకర్స్‌తో మొహమాటం లేకుండా చెప్పేసిందట. ఆలస్యంగా ఈ విషయం బయటకు రాగా శ్రీముఖి చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -