- Advertisement -

మండపేట టీడీపీలో అసమ్మతి సెగ?

- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీ టీడీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. జనసేనతో సీట్లు కొల్పోయే నేతలను బుజ్జగించడం ఒక వైపు అయితే మరోవైపు టీడీపీలో వర్గపోరుతో చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి. మండపేట స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుపై టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మండపేట టీడీపీ ఎమ్మెల్యే సీటు మార్చాలని ఆ పార్టీ నెక్కంటి బాలకృష్ణ డిమాండ్ చేశారు.

వేగుళ్లకు సీటు ఇస్తే గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. మండపేట విషయంలో కార్యకర్తల అభిప్రాయాన్ని చంద్రబాబు పరిగణలోకి తీసుకోవాలని లేదంటే పరాభవం తప్పదన్నారు. ఒకవేళ టీడీపీ సీటు తనకు కేటాయిస్తే గెలిచి వస్తానని తెలిపారు. మండపేటలో ఇటీవల రా కదలి రా సభలో పాల్గొన్న చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్లకే మరోసారి సీటు కేటాయించారు. దీనిపై టీడీపీ నేతలతో జనసేన నేతలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇక మండపేట మీటింగ్ తర్వాత చంద్రబాబుపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని చెబుతూ రాజోల్, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి షాకిచ్చారు. పవన్ నిర్ణయం తర్వాత చంద్రబాబు డిఫెన్స్‌లో పడ్డారు. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతుండటం చర్చనీయాశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -