Friday, May 17, 2024
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్…సీపీఎంకు షాక్

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజైంది. మొత్తం 55 మందితో తొలి జాబితాను ప్రకటించగా 12 మంది ఎస్సీ, ఇద్దరు ఎస్టీలకు తొలి జాబితాలో ఛాన్స్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తు ఉంటుందని భావించినా సీపీఎం అడిగిన భద్రాచలం స్ధానానికి అభ్యర్థిని ప్రకటించింది. దీంతో వామపక్షాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తొలి జాబితాలో 12 మందికి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వారే ఉన్నారు.

మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి టికెట్ దక్కింది. అలాగే వేముల వీరేశంకు జాబితాలో చోటు దక్కగా సీపీఎంకు హ్యాండిచ్చిన కాంగ్రెస్…సీపీఐ అడిగిన మునుగోడు స్ధానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గం నుండి జానారెడ్డి కుమారుడికి టికెట్ దక్కింది.ఎల్బీనగర్, మహేశ్వరం, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలకు పేర్లను ఖరారు చేయలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -