Monday, April 29, 2024
- Advertisement -

సీపీఎంతో కటీఫ్…సీపీఐతో కాంగ్రెస్ దోస్తి!

- Advertisement -

తెలంగాణలో కొత్త పొత్తు తెరపైకి వచ్చిందా…?ఇప్పటివరకు వామపక్షాలతో కలిసి వెళ్తామన్న కాంగ్రెస్…సీపీఎంకు ఎందుకు హ్యాండిచ్చింది…?కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదలయిన తర్వాత అందరు ఆలోచిస్తుంది ఇదే. 55 మందితో తొలి జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని భావించింది కాంగ్రెస్. ఆ దిశగానే సీపీఎం, సీపీఐ నేతలతో పలు దఫాల్లో చర్చలు కూడా జరిగాయి.

సీపీఎం, సీపీఐలకు చెరో రెండు స్ధానాలు, చెరో ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇందులో సీపీఐ అడిగిన కొత్తగూడెంతో పాటు చెన్నూరు స్ధానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ సీపీఎం అడిగిన భద్రాచలంకు అభ్యర్థిని ప్రకటించగా పాలేరు స్ధానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక ప్రధానంగా సీపీఎం అడిగిన భద్రాచలం కోసం పట్టుబట్టగా దానిని సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకే కేటాయించింది. దీంతో కాంగ్రెస్ – సీపీఐ మధ్య పొత్తు దాదాపు ఖరారు కాగా సీపీఎం పరిస్థితి ఏంటా అన్నది తెలియాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం సీపీఎంతోనూ పొత్తు ఉంటుందని చెబుతున్నారు. మరి దీనిపై సీపీఎం నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఇక రెండు రోజుల్లో రెండో జాబితా రానుండగా మెజార్టీ సీట్లను ప్రకటించే ఛాన్స్ ఉంది. రెండో జాబితాలో సీపీఎంతో పొత్తుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -