Tuesday, May 7, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఖరారైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్..అధిష్టానం సూచనతో ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యతను తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా 10కి పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది కాంగ్రెస్.

ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలోనూ ముందంజలోనే ఉంది. ఇప్పటికే మహబూబ్ నగర్ స్థానం నుంచి చల్లా వంశీ చంద్ రెడ్డి పేరును ప్రకటించారు సీఎం రేవంత్. కొడంగల్ నుండి 50 వేల మెజార్టీ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేయగా మిగితా స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

మహబూబ్ నగర్ – చల్లా వంశీ చంద్ రెడ్డి,చేవెళ్ల- పట్నం సునీతారెడ్డి,సికింద్రాబాద్- బొంతు రామ్మోహన్ ,మెదక్- మైనంపల్లి హనుమంతరావు,జహీరాబాద్ – సురేశ్ షెట్కార్ ,నిజామాబాద్ – జీవన్ రెడ్డి,ఆదిలాబాద్ – రేఖా నాయక్,మహబూబాబాద్ – బలరాం నాయక్,వరంగల్ – అద్దంకి దయాకర్,పెద్దపల్లి – వెంకటేశ్ నేత,
మల్కాజ్ గిరి – కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (అల్లు అర్జున్ మామ) పేర్లు ఖరారైనట్లు సమాచారం.

ఖమ్మం – పొంగులేటి ప్రసాద్ రెడ్డి లేదా మల్లు నందిని,హైదరాబాద్ – సమీర్ ఉల్లా(మైనార్టీ నేత),నాగర్ కర్నూలు – సంపత్ కుమార్ లేదా మల్లు రవి,నల్గొండ – జానారెడ్డి లేదా పటేల్ రమేశ్ రెడ్డి,భువనగిరి – కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి(డాక్టర్) లేదా చామల కిరణ్ కుమార్ రెడ్డి,కరీంనగర్ – ప్రవీణ్ రెడ్డి లేదా రాజేందర్ రావు ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -