ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉండగానే దూకుడు పెంచారు జగన్. ఇప్పటికే సిద్ధం సభలతో వైసీపీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్న జగన్ తాజాగా సిద్ధం వేదికగానే మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జగన్ నిర్వహించిన భీమిలి, దెందులూరు, రాప్తాడు సిద్ధం సభలు ఊహించని విధంగా సక్సెస్ అయ్యాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొనగా తాజాగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని బొప్పూరు దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తోంది.
ఇక వైసీపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇదే వేదిక మీద నుంచి ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక జగన్ నిర్వహించే సిద్ధం సభ ఇదే చివరిది కావడంతో ప్రతిష్టాత్మకంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
రుణమాఫీతో పాటు మహిళల కోసం అదిరే స్కీమ్ తీసుకురానున్నారని ప్రచారం జరుగుతోంది. అగ్రవర్ణ పేదలను ఆదుకునేలా కొత్త స్కీమ్‌ను తీసుకొస్తారనే ప్రచారం జరుగుతోంది.
