తెలంగాణలో కాంగ్రెస్‌తో దోస్తిని కటీఫ్ చేసుకుంది సీపీఎం. వామపక్షాలు తమ సహజ దోస్తులని కాంగ్రెస్ ఓ వైపు చెబుతూనే మరోవైపు సీపీఎంతో దోస్తిని కట్ చేసుకుంది. తాము చెప్పిన స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో ఒంటరిపోరుకే సిద్ధమైంది కాంగ్రెస్. హస్తం పార్టీ తమను మోసం చేసిందని పొత్తు కోసం చివరి మెట్టు దిగినా ఆపార్టీ పట్టించుకోలేదని అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిపోరుకు సిద్ధమైనట్లు తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించారు తమ్మినేని. ఇక పాలేరు నుండి స్వయంగా వీరభద్రం బరిలోకి దిగుతున్నారు. అలాగే మిర్యాలగూడ నుండి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండగా కోదాడ, హుజూర్‌నగర్, నల్గొండ స్ధానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఇక జాబితా ప్రకటించే ముందు తమ్మినేనితో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడిన ప్రయోజనం లేకపోయింది.
పాలేరు- తమ్మినేని వీరభద్రం,వైరా- భూక్య వీరభద్రం,సత్తుపల్లి- భారతి,ఖమ్మం- ఎర్ర శ్రీకాంత్,మధిర- పాలడుగు భాస్కర్,భద్రాచలం- కారం పుల్లయ్య,అశ్వరావుపేట- పిట్టల అర్జున్,మిర్యాలగూడ- జూలకంటి రంగారెడ్డి,నకిరేకల్- చిన వెంకులు,భువనగిరి- నర్సింహా,జనగామ- మోకు కనకారెడ్డి,ఇబ్రహీపట్నం- పగడాల యాదయ్య,పఠాన్‌చెరూ- మల్లికార్జున్,ముషీరాబాద్- దశరథ సీపీఎం ప్రకటించిన జాబితాలో ఉన్నారు.
ఇక ఇప్పటివరకు బీజేపీని ఓడించడమే లక్ష్యమని ప్రకటించిన సీపీఎం…ఇప్పుడు కాంగ్రెస్‌ని కూడా టార్గెట్ చేసినట్లు సమాచారం. అందుకే పాలేరు, నల్గొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తంగా సీపీఎం బరిలోకి దిగుతుండటం కాంగ్రెస్‌కు మైనస్‌గా మారే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.