Wednesday, May 8, 2024
- Advertisement -

సీపీఎం- కాంగ్రెస్..మీకు మీరే మాకు మేమే!

- Advertisement -

అంతా ఊహించినట్లే జరిగింది. సీట్ల పంపకాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటివరకు 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగితా 19 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక కామ్రేడ్లతో పొత్తు బెడిసికొట్టింది. కాంగ్రెస్ కేటాయించిన కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను సీపీఐ అంగీకరించగా సీపీఎం మాత్రం తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తితోనే ఉంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు అల్టీమేటం జారీ చేసింది సీపీఎం. తాము కోరిన స్థానాలను ఇవ్వకుంటే ఒంటరి పోరుకు దిగుతామని స్పస్టం చేసింది. దీంతో దాదాపు సీపీఎం – కాంగ్రెస్ పొత్తు బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది.
పొత్తుల్లో భాగంగా సీపీఎం అడిగిన రెండు సీట్లను కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. మిర్యాలగూడ, వైరా స్థానాలను సీపీఎం కోరగా ఆ రెండింటిని కాంగ్రెస్ తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సీపీఎం సింగిల్‌గానే బరిలోకి దిగేందుకు కసరత్తు చేస్తోంది.

ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలను రిలీజ్ చేయగా అసంతృప్తులతో మల్లగుల్లాలు పడుతోంది. సీట్లు దక్కని వారంతా పార్టీకి రాజీనామా చేస్తుండగా కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరుతామిన శపథం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వామపక్షాలతో పొత్తు బెడిసికొట్టడం కాంగ్రెస్‌కు మరింత ఇబ్బందికర పరిణామమేనని అంతా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -