Sunday, May 19, 2024
- Advertisement -

కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీలు కట్..బీఆర్ఎస్‌కే ప్లస్‌!

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ – వామపక్షాల పొత్తుకు బ్రేక్ పడింది. పొత్తులో భాగంగా చెరో రెండు స్థానాలను ఆశీంచిన సీపీఎం- సీపీఐకు నిరాశే మిగిలింది. దీంతో ఒంటిరిపోరుకే సిద్ధమయ్యాయి వామపక్షాలు. ముఖ్యంగా కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది సీపీఎం. కాంగ్రెస్ తమని నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు సీపీఎం కార్యదర్శి తమ్మినేని.

పొత్తు ధర్మంలో భాగంగా తాము ఎన్నో మెట్లు దిగామని కానీ కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. సీపీఎం 17 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ మిత్ర ధర్మాన్ని పాటించలేదని…పొత్తు లేకుండా విడిగానే పోటీచేయాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ వైఖరి మమ్మల్ని ఎంతగానో బాధించిందని…పొత్తు చెడిపోవడానికి కాంగ్రెసే కారణం అన్నారు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్ విలువనివ్వలేదన్నారు.

ఇక సీపీఐ సైతం కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉంది. ఆ పార్టీ కూడా పదికి పైగా స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది.అయితే వామపక్షాలు కలిసే పోటీ చేస్తుండటంతో ఖమ్మం, సింగరేణి ఏరియాలో ప్రభావం చూపడం పక్కా. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్‌కు మైనస్‌గా మారే అవకాశమే ఉంది. ఇక బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ – లెఫ్ట్ పార్టీల పొత్తు కుదరకపోతే అది తమకే లాభిస్తుందని భావించగా అదే జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -