Monday, May 20, 2024
- Advertisement -

ఏపీ కొత్త పొత్తు పొడిచింది!

- Advertisement -

ఎన్నికల రణక్షేత్రానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది ఏపీ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఇక ఎన్నికల రంగంలో వైసీపీ ఒంటరిగా వస్తుండగా మిగిలిన పార్టీలు పొత్తులతో ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే జనసేన – టీడీపీ మధ్య పొత్తు కుదరగా త్వరలోనే ఈ కూటమిలో బీజేపీలో చేరనుంది. అలాగే కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు వామపక్షలు కసరత్తు చేస్తున్నాయి.

కాంగ్రెస్ తో కలసి వెళ్లేందుకు సీపీఎం కి ఎలాంటి అభ్యంతరం లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఇతర పార్టీలు వస్తే సీట్ల సర్దుబాటు చేసుకుని పొత్తులతో ముందుకు సాగుతామని తెలిపారు. ఇక సీపీఎం ఓకే చెప్పగా త్వరలోనే సీపీఐ కూడా తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. అంటున్నారు.

పొత్తులో భాగంగా 26 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తామని, ఇతర పార్టీలు కలిస్తే అడ్జస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు శ్రీనివాస్ రావు. దీంతో ఏపీలో మరో కూటమి రెడీ కాగా ఎవరు ఏ మేరకు సత్తా చాటుతారో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -