Sunday, May 4, 2025
- Advertisement -

కేసీఆర్ వర్సెస్ తుమ్మల…మధ్యలో పువ్వాడ!

- Advertisement -

తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సీఎం కేసీఆర్ ఆదివారం కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో మాట్లాడి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

తుమ్మల, పొంగులేటి ఇద్దరూ బీఆర్ఎస్‌లో నుండే కాంగ్రెస్‌లో చేరారు. ఇక ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…ఖమ్మం జిల్లా నుండి ఒక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలవనీయనని శపథం పూనారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వీరిద్దరిపై ఘాటుగానే స్పందించారు. ఖమ్మం జిల్లాను పొంగులేటి గుత్తా తీసుకున్నారా, ప్రజలను కొన్నారా ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఫైరయ్యారు.

ఇక తుమ్మల విషయానికొస్తే పువ్వాడను పొగుడుతూనే తుమ్మల గాలి తీసేశారు. ఓడిపోయిన వ్యక్తిని మంత్రిని చేసి ఖమ్మం జిల్లాను అప్పజెప్పితే ఒక్క పువ్వాడ అజయ్ తప్ప ఎవరు గెలవలేదని దుయ్యబట్టారు. తుమ్మల తనకు మంత్రి పదవికి ఇచ్చానని చెబుతుండటం హాస్యాస్పదమని…ఖమ్మం జిల్లాలకు తుమ్మల లాంటి ముళ్లు కావాలో పువ్వాడ అజయ్‌ లాంటి పువ్వు కావాలో ఆలోచించుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును పంచతంత్ర కథల్లోని కరకట దమనకులతో పోల్చారు.

దీనికి తుమ్మల ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించిందే తానని మరోసారి స్పష్టం చేశారు. పువ్వాడ పూజకు పనికి రాని పువ్వని…ఆయన్ని వెంట పెట్టుకుని తిరుగుతున్న కేసీఆర్‌కు ఈ సారి పరాభవం తప్పదని తేల్చిచెప్పారు. కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించింది తానేనని కావాలంటే చంద్రబాబుని అడగాలని చెప్పారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తనది ప్రత్యేక స్థానం అని చెప్పుకొచ్చారు. మొత్తంగా సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటన ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ని పెంచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -