Friday, May 3, 2024
- Advertisement -

మావోల మద్దతు కోరిన కాంగ్రెస్ మంత్రి!

- Advertisement -

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్,బీఆర్ఎస్,బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా ఎవరికి వారే తమకు డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని జోస్యం చెబుతున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ తరపున ప్రచారం చేస్తున్న తుమ్మల…బలరాం నాయక్‌కు మావోయిస్టులు సహకరించాలన్నారు. భద్రాచలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో తుమ్మల చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు చంపుతామని బెదిరించినప్పటికీ అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేసుకున్నారు. భద్రాచలంలో కమ్యూనిస్టులు గెలుపొందిన సమయంలో కూడా అభివృద్ధిని ఆపకుండా చేశామన్నారు. ప్రజల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మావోలు…బలరాం నాయక్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఇటీవల బీజాపూర్‌ జిల్లా ఊసూరు బ్లాక్‌ పూజార్‌ కాంకేర్‌లో తెలంగాణ గ్రేహౌండ్స్‌ స్పెషల్‌ పార్టీ పోలీసులకు, మావోయిస్టుల ఎదురుకాల్పులు జరుగగా ముగ్గురు మావోలు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ములుగు ఎస్పీ బాధ్యత వహించాలని…సీఎం రేవంత్ రెడ్డి మావోలపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారి ఆరోపించింది మావోయిస్టు పార్టీ. ఈ క్రమంలో తుమ్మల చేసిన కామెంట్స్‌కు మావోలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -