Sunday, May 5, 2024
- Advertisement -

కన్ఫామ్‌…తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో టీటీడీపీ పోటీకి దూరంగా ఉండనుందా…?ఒకవేళ పోటీకి దూరమైతే ఎవరికి మద్దతివ్వనుంది…?ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక టీటీడీపీ ఏ విధమైన స్టాండ్ తీసుకోవాలి అనే దానిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ కానున్నారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చించి అనంతరం కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 80కి పైగా స్థానాల్లో పోటీచేస్తామని కాసాని ప్రకటించినా తర్వాత బాలయ్య వారించడంతో వెనక్కితగ్గారు. ఈ నేపథ్యంలో బాబు – కాసాని భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

టీటీడీపో పోటీపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా దీనిని ఖండించారు కాసాని. ఖచ్చితంగా టీటీడీపీ పోటీ చేస్తుందని చెప్పినా చంద్రబాబు డిసిషనే ఫైనల్ కానుంది. ఇక పార్టీ వర్గాల నుండి సమాచారం ప్రకారం టీటీడీపీని పోటీకి దూరంగా ఉంచి బీజేపీకి మద్దతిస్తారని టాక్. ఇక ఒకవేళ టీడీపీ పోటీ నుండి తప్పుకుంటే అది బీజేపీకి లాభం జరుగుతుందా లేదా కాంగ్రెస్‌కు మేలవుతుందా అన్నది కాలమే నిర్ణయించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -