Saturday, May 18, 2024
- Advertisement -

కర్ణాటక ట్రెండే తెలంగాణలో రీపిట్ అవుతుందా?

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జోరందుకున్నాయి. నామినేషన్ల స్వీకరణకు టైం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక సర్వేల పేరిట ఎవరికి వారే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్వేలు బీఆర్ఎస్, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెబుతుండగా ప్రధానంగా కాంగ్రెస్ మాత్రం కర్ణాటక ఫలితాలే రీపిట్ అవుతాయని భావిస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి అండగా నిలిచారు ముస్లిం ఓటర్లు. దీనికి తోడు కాంగ్రెస్ హామీలు అధికారాన్ని కట్టబెట్టాయి. ఇక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్, జేడీఎస్‌ ముస్లిం ఓట్లను పంచుకునేవి. కానీ బీజేపీతో విసిగిపోయిన వారు ఔట్‌రైట్‌గా కాంగ్రెస్‌కే మద్దతుగా నిలిచారు. తెలంగాణలో కూడా ఇదే ట్రెండ్ జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుండగా బీఆర్ఎస్ సైతం ముస్లిం ఓటర్లు తమకే అండగా ఉన్నారని అంచనా వేస్తోంది.

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే మద్దతుగా నిలిచారు ముస్లిం ఓటర్లు. ఇక ఈ రెండు సార్లు ఎంఐఎం మద్దతు కూడా బీఆర్ఎస్‌కే ఉంది. తాజాగా మజ్లిస్‌ నేతలే స్వయంగా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని చెబుతున్న పరిస్థితి. మొత్తంగా తెలంగాణ ఓటర్లలో 13 శాతం ఉన్న ముస్లింలు ఏ విధమైన స్టాండ్ తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా ఎవరు అధికారంలోకి రావాలన్నది వారి చేతుల్లో ఉందనేది చెప్పక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -