Thursday, May 9, 2024
- Advertisement -

బీఆర్ఎస్‌కు షాక్..తాటికొండ గుడ్ బై

- Advertisement -

బీఆర్ఎస్‌కు తొలి షాక్ తగిలింది. ఆ పార్టీకి ఫస్ట్ వికెట్‌ డౌన్ అయింది. సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు.తన సొంతగూటికి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల పొంగులేటితో భేటీ అయిన తాటికొండ…ఈనెల 10న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆరు నెలల నుంచి మానసిక వేదనకు గురవుతున్నానని, ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా… 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసినా పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేశానని తెలిపారు.

పార్టీకి విధేయుడిగా ఉన్న తనకు మాత్రం అన్యాయమే జరిగిందన్నారు. ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఈరోజుకీ లేదని..మాదిగ ఆస్థిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరానని అలాంటి నాకు అన్యాయం చేశారన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -