- Advertisement -

వైఎస్ ఇంటి పేరు కాదు..ఓ బ్రాండ్

- Advertisement -

వైయస్ అనేది ఒక ఇంటి పేరు మాత్రమే కాదు.. రాజకీయాల్లో నైతికతకు.. ఇచ్చినమాట మీద నిలబడే తత్వానికి.. పోరాట తత్వానికి.. ప్రజల పట్ల ప్రేమాభిమానాలు చూపే అంశంలో ఎక్కడా రాజీ పడని తీరుకు ఒక బ్రాండ్.. వైయస్ అనే బ్రాండ్ వచ్చేవరకు రాజకీయాలు అంటే ఒక వంచన..మోసం.. వాడుకుని వదిలేయడం..నమ్మించి మోసం చేయడం..ఇవే ఉండేవి

వైయస్ వచ్చాకే రాజకీయాలకు విలువ..నాయకులకు గౌరవం దక్కినాయ్.ఇప్పుడు మళ్లీ ఆ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడు అయ్యారు.ఇచ్చిన మాట.. చేసిన వాగ్దానం అమలు చేసే విషయంలో వైయస్ఆర్ రెండు అడుగులు ముందుకు వేస్తే ఆయన కొడుకు నాలుగు అడుగులు వేస్తున్నారు.

ప్రజలని పాలించడం కాదు లాలించడం ముఖ్యమంత్రి బాధ్యత అని సరికొత్త నిర్వచనం ఇచ్చారు.రైతులు.మహిళలను ఆదరించే విషయంలో తండ్రిని దాటుకుని ముందుకు వెళ్లిన జగన్ ఆ వర్గాల పాలిట దేవుడయ్యారు.తండ్రి ఆశయాలు నేరవెర్చే విషయంలో జగన్ మోహన్ రెడ్డి అన్నివిధాలా సక్సెస్ అయ్యారు

తండ్రి పాలనకు కొనసాగింపుగా మొదలైన జగనన్న పాలన సంక్షేమం..అభివృద్ధి అంశాల్లో కొత్త రికార్డులను సృష్టిస్తోంది.వైయస్ అంటే రాజకీయాల్లో ఒక ఐఎస్ఐ మార్క్ వంటిది.అలాంటి ఇంటిపేరును కొంతమంది స్వలాభం కోసం.. రాజకీయ లబ్ధికోసం వాడుకోవడం నిజంగా దురదృష్టం .వైయస్ అనే ఇంటిపేరును దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి.. ఆయన సోదరులు మాత్రమే పెట్టుకుంటారు తప్ప ఆ బ్రాండ్ ను ఎవరుబడితే వాళ్ళు ఎలా వాడుకుంటారు.

ఆ బ్రాండ్..ఆ లోగో వాడాలంటే ఒక అర్హత ఉండాలి.. గుండెల్లో దమ్ము ఉండాలి.. మాట మీద నియంత్రణ ఉండాలి.. ఇచ్చినమాటకు కట్టుబడేవాడు అయి ఉండాలి..
పేరు బాగుంది కదాని ఎవరుబడిటే వాళ్ళు ఎలా వాడుకుంటారు.. అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా.వైయస్ అనే బ్రాండ్ ను వాడుకుని లబ్దిపొందాలి అనుకునే వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -