ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు. బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్నానని చెప్పారు వివేక్. ఇక రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆనంతరం తిరిగి సొంతగూటికి చేరారు. వివేక్ తో పాటు ఆయన తనయుడు వంశీ కృష్ణ కాంగ్రెస్ లో చేరగా వంశీకి చెన్నూరు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఇక తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు వివేక్. ప్రస్తుతం బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. పార్టీలో ఇంతకాలం తనకు సపోర్టు చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. వి ఇక బీజేపీకి రాజీనామా చేసిన వివేక్‌తో మాట్లాడారు మల్లికార్జున ఖర్గే.
కాకా గుర్తింపు తెచ్చుకున్న గుడిసెల వెంకటస్వామి తనయుడే వివేక్. ఎంపీగా పనిచేశారు. పెద్దపల్లి ఎంపీ నియోకవర్గం పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి పట్టుఉంది. తెలంగాణ కోసం కొట్లాడిన ఎంపీల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు వివేక్.