Monday, May 5, 2025
- Advertisement -

వాట్సాప్..ఈ ఫీచర్‌ అదుర్స్!

- Advertisement -

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకోస్తూ యూజర్స్ ను ఆకట్టుకుంటోంది వాట్సాప్. మెసేజింగ్ ఫ్లాట్ ఫామ్ లో ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ యాప్ నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏదైనా టెక్స్ట్ రూపంలో మెసేజ్ పంపాలన్న లేదా ఫోటో పంపాలన్న వాట్సప్ ఉపయోగించే షేర్ చేస్తూ ఉంటారు. ఇలా మన డైలీ యుసెజ్ లో వాట్సాప్ ఎంతో ముఖ్యమైపోయింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్న వాట్సాప్ తాజాగా మరో అదిరే ఫీచర్‌తో ముందుకువచ్చింది.

త్వరలో వినియోగదారులకు డేటాను ఆటో-సేవ్ ఆప్షన్ కంట్రోలింగ్ అందించనుంది. కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ అందరి వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత డేటా మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు.

మీరు ఈ ప్రైవసీ ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. మీరు పంపిన ఫొటో లేదా వీడియో ఏదైనా ఆటో సేవ్ కాదు.. ఇతరులకు కూడా ఫార్వార్డ్ చేయడం కుదరదు. ఈ కొత్త ఫీచర్ ఆన్ చేస్తే చాలు.. మెటా ఏఐ చాట్స్ కూడా యాక్సస్ చేయలేరు. అంటే ఈ ఫీచర్ ద్వారా ఇకపై యూజర్లు మీడియా ఫైల్స్ ఇతరుల ఫోన్లలో ఆటో సేవ్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు .

ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఇకపై మీరు పంపే ఏ ఫొటో లేదా వీడియో డేటాను ఎవరూ సేవ్ చేయాలో లేదో డిసైడ్ చేయొచ్చు. ఒక రకంగా యూజర్లకు అందించే డిసప్పియరింగ్ మెసేజ్ ఆప్షన్ లాగానే ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -