Sunday, June 16, 2024
- Advertisement -

పిన్నెల్లినే టార్గెట్ ఎందుకు?

- Advertisement -

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేసినట్లుగా పలు రకాల వీడియోలు వైరల్ గా మారగా అది ఫేక్ వీడియో అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉండవలసిన ఈ వీడియోలు లోకేష్ ట్విట్టర్ లోకి ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక వాస్తవానికి పిన్నెల్లినే కూటమి నేతలు ఎందుకు టార్గెట్ చేశారనే చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు పిన్నెల్లి. యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా ఆ తర్వాత 2004లో జడ్పీటీసీగా గెలిచారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్‌కు మద్దతుగా నిలిచారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచారు. ఆ తర్వాత 2014,2019లో విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విప్‌గా పనిచేశారు.

జగన్‌కు అత్యంత సన్నిహితుడైన పిన్నెల్లిని రిగ్గింగ్‌తో ఓడించాలని పచ్చ బ్యాచ్ కుట్ర పన్నిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈసారి గెలిస్తే పిన్నెల్లికి మంత్రి పదవి గ్యారెంటీ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కావాలనే కొంతమంది టార్గెట్ చేసి కుట్ర పన్నారని మండిపడుతున్నారు. పిన్నెల్లిని ఓడించడం అసాధ్యం కాబట్టి రెచ్చగొట్టి ఈ విధంగా చేయించారనే ప్రచారం కూడా స్థానికంగా జరుగుతోంది. పిన్నెల్లి అజ్ఞాతం వీడి ప్రజల ముందుకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయని స్ధానికులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా మాచర్లలో జరిగిన గొడవల వెనుక ఎవరి హస్తం ఉందో సిట్ త్వరలోనే నిగ్గుతేల్చనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -