- Advertisement -

పిన్నెల్లికి బిగ్ రిలీఫ్

- Advertisement -

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. మూడు కేసుల్లో మధ్యంతర, ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని..అయితే ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.

కౌంటింగ్ ప్రక్రియలో పిన్నెల్లి పాల్గొనవచ్చని తెలిపిన న్యాయస్థానం… ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు ప్రస్తుతం మూడు కేసుల్లోనూ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఎన్నికల పోలింగ్ సమయంలో పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియో బయటకు రాగా అది వైరల్‌గా మారింది. దీంతో పాటు టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్ బూత్ వద్ద మహిళపై దుర్భాషలాడిన కేసు, కారంపూడిలో సీఐపై దాడి చేసిన కేసులు పిన్నెల్లిపై నమోదయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -