Monday, May 20, 2024
- Advertisement -

బ్రేకింగ్..చంద్రబాబుకు గుడ్ ఫ్రైడేనా?

- Advertisement -

ఈ శుక్రవారం టీడీపీ నేతలు శుభవార్త వింటారా..?నారా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరయనుందా?..చంద్రబాబు జైలు నుండి బయటకు రానున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు రిమాండ్‌ 40 రోజులు దాటింది. ఇక బాబుపై దాఖలైన పలు కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చింది. దీంతో పాటు మూడోసారి చంద్రబాబు రిమాండ్‌ని పొడగించింది న్యాయస్థానం.

ఇక ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన పేరును తొలగించాలని సుప్రీంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం రేపు(శుక్రవారం) తీర్పు వెలువరించనుంది. వాస్తవానికి కేంద్ర హోంమంత్రితో నారా లోకేష్ భేటీ తర్వాత చంద్రబాబు బయటకు రావడం ఖాయమని ప్రచారం జరిగింది. తర్వాత ఒక్కొక్క కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తున్న నేపథ్యంలో బాబు ఈ ఫ్రైడే విడుదల కావడం ఖాయమని ధీమాగా ఉన్నారు.

వాస్తవానికి చంద్రబాబు లాయర్లు మొదటి నుండి వాదిస్తుంది సెక్షన్ 17ఏ పైనే. వీఐపీలను అరెస్ట్ చేయడం లేదా రిమాండ్‌ చేయడానికి ముందు 17ఏ ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే దీనినే ప్రస్తావిస్తూ వాదిస్తూ వస్తున్నారు చంద్రబాబు తరపు లాయర్లు. అందుకే బాబుకు ఊరట లభించడం ఖాయమని న్యాయవాదులు కూడా చెబుతుండగా టీడీపీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.ఏదిఏమైనా ఈ శుక్రవారం బాబు టీంకు గుడ్ ఫ్రైడే అవుతుందా లేదా తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -