- Advertisement -

రిమాండ్ పొడగించినా…బెయిల్ వస్తుందా?

- Advertisement -

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్‌ను నాలుగోసారి పొడగించింది న్యాయస్థానం. మూడోసారి పొడగించిన రిమాండ్ నేటితో ముగియనుండగా చంద్రబాబును వర్చువల్‌గా ఏపీ సీఐడీ జడ్జి ముందట హాజరుపర్చారు. అనంతరం రిమాండ్‌ను నవంబర్ 1 వరకు పొడగిస్తునట్లు జడ్జి తెలిపారు. ఇక ఈ సమయంలో చంద్రబాబు ప్రస్తవించిన అంశాలను రాతపూర్వకంగా అందించాలని సూచించారు న్యాయమూర్తి.

సీఐడీ కోర్టు రిమాండ్ పొడగించిన అనంతరం స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున దీనిపై విచారణ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టులో బెయిల్‌పై ఆశలు పెట్టుకున్న చంద్రబాబు రేపటి వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

హైకోర్టులో చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిందని…సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌ తీర్పు రిజర్వులో ఉందని ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వొద్దని వాదించారు పొన్నవోలు. దీనిని పరగణలోకి తీసుకున్న న్యాయస్థానం బాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి బెయిల్ పిటిషన్‌ వెంటనే విచారణ జరపాలని….ఈ కేసులో చాలామందికి ఇప్పటికే బెయిల్ వచ్చింది కాబట్టి చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వమని కోరారు లూథ్రా. ఏదిఏమైనా రేపు చంద్రబాబుకు గుడ్ ఫ్రై డే అవుతుందా లేదా వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -