- Advertisement -

రాజోలులో ఈసారి సీన్ రివర్స్!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో తూర్పు గోదావరి జిల్లా రాజోలుది ప్రత్యేక స్థానం. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో ఒకటైన ఈ నియోజకవ వర్గం వార్తల్లో నిలిచింది ఎందుకంటే. పవన్ పార్టీ జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుండే. 2019 ఎన్నికల్లో రాపాక వరప్రసాదరావు గెలుపొందారు. పవన్ తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోగా ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంలో జనసేన జెండా ఎగిరింది.

అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏడాదిలోనే రాపాక వైసీపీలో చేరగా ఈ సారి ఆయన బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. 2004 వరకు జనరల్‌ స్థానంగా ఉన్న రాజోలు నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఎస్సీ రిజర్వుడుగా మారింది. 2004లో కాంగ్రెస్‌ నుండి అల్లూరి కృష్ణంరాజు, 2009లో రాపాక వరప్రసాదరావు గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గొల్లపల్లి సూర్యారావు, వైసీపీ తరపున బంతు రాజేశ్వరరావు తలపడగా గొల్లపల్లి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున మళ్లీ బంతు రాజేశ్వరరావుకే అవకాశం దక్కగా జనసేన నుండి రాపాక గెలుపొందారు.

అయితే ఈ సారి సీన్ రివర్స్ అయి జనసేన నుండి బంతు నాగేశ్వరరావు పోటీలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండగా వైసీపీ అభ్యర్ధిగా రాపాక వరప్రసాదరావు పోటీలో ఉండటం దాదాపు ఖాయమైంది. ఇప్పుడు ఇదే స్థానికంగా చర్చనీయాశంగా మారింది. ఇక పవన్‌ మొదటి దశ వారాహి యాత్ర సందర్భంగా మలికిపురంలో నిర్వహించగా ఇక్కడి జనసైనికుల్లో ఉత్సాహం నిపింది. టీడీపీ తరపున గొల్లపల్లి సూర్యారావు బరిలో ఉండే అవకాశాలుండగా ఈ సారి రాజోలులో గెలిచేది ఎవరో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -