Friday, March 29, 2024
- Advertisement -

‘ఈ నగరానికి ఏమయింది..?’ అంటున్న త‌రుణ్‌భాస్క‌ర్‌

- Advertisement -

తొలి సినిమా ‘పెళ్లి చూపులు’ సినిమాతో బంట‌ర్ హిట్ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్‌. జాతీయ స్థాయి అవార్డు కూడా అందుకోవ‌డంతో త‌రుణ్ భాస్క‌ర్‌పై అంద‌రీ ఫోక‌స్ ప‌డింది. పెళ్లి చూపులు సినిమా త‌ర్వాత త‌రుణ్ ఏ సినిమా చేస్తాడు.. ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అత‌డి సినిమా కోసం ప్రేక్ష‌కులు వేచి ఉన్నారు. తొలి సినిమాతోనే మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా త‌రుణ్ నిరూపించుకున్నాడు. తొలి చిత్రం ఘనవిజయం సాధించినా.. రెండో సినిమాను ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు తరుణ్.

తన రెండో సినిమా సురేశ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే చేస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడూ మొదలవుతుందో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే రోడ్డు థ్రిల్ల‌ర్ సినిమా తీస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా తరుణ్ భాస్కర్ రెండో సినిమాపై ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. తను చేస్తున్న రెండో సినిమాకు తరుణ్ ఓ విభిన్న‌మైన టైటిల్‌ను నిర్ణయించాడు. ప్రతీ సినిమా ప్రారంభంలో వచ్చే ‘ఈ నగరానికి ఏమయింది..?’అనే మాటలనే తన టైటిల్‌గా ఫిక్స్ చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -